AP&TGMOVIESOTHERS

విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో స్టార్ హీరో

అమరావతి: తమిళ హీరో విశాల్ తీవమైన ఆనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తొంది..పందెం కోడి, పొగరు, లాఠీ లాంటి పలు సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు..అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు..ప్రస్తుతం మనం చూస్తున్న విశాల్, గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు..బాగా బక్కచిక్కిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నాడు..చేతులు కూడా వణికిపోతున్నాయి..
2012లో షూటింగ్ ప్రారంభించిన మదగజరాజ సినిమా కొన్ని సమస్యల వల్ల విపరీతంగా ఆలస్యం అయింది.. అన్ని సమస్యలను అధికమించిన మదగజరాజ,, సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 12వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా మదగజరాజ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు..హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు..ఈ ఈవెంట్ కు వచ్చిన విశాల్ ను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.. మోహం అంతా వాచిపోయి, మాట్లాడుతున్న టైంలో చేతులు వణికిపోతూ,, నోట్లోంచి మాట కూడా సరిగా రాలేని స్థితిలో ఉన్నాడు.. విశాల్ పరిస్థితిని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.. అయితే విశాల్ తీవ్ర చలి జ్వరం,, జలుబుతో బాధపడుతున్నాడని తెలుస్తోంది..నిజంగా చలి జ్వరమేనా లేదా వేరే సమస్య ఏదైనా ఉందా ? అనేది తెలియాలంటే విశాల్ లేదా అతని టీమ్ స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే..ఏది ఏమైనప్పటికి విశాల్ త్వరగా కోలుకుని మళ్లీ పూర్తి ఫిట్ నెస్ తో రావాలని అందరూ కోరుకుందాం.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *