AP&TGMOVIESOTHERS

రా-ఎన్టీఆర్-వాళ్ళతో మాకు సంబంధం లేదని స్పష్టం చేసిన ఎన్టీఆర్ కార్యాలయం

వివరణతో లేఖ విడుదల..

హైదరాబాద్: నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఈనెల 18న ప్రారంభించనున్న ఊరు-వాడ సేవా కార్యక్రమాన్ని ఆసరా చేసుకుని RAW NTR పేరుతో ప్రైవేటు వ్యక్తులు ఒక ఆర్గనైజింగ్ సంస్థ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఏకంగా వంద కోట్లు ఎన్టీఆర్ ప్రజాసేవకోసం ఖర్చు చేయబోతున్నారని.. రాజకీయ అరంగేట్రం భాగంగా ఇది ప్రారంభిస్తున్నట్లుగా రా-ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు తప్పుదోవ పట్టిస్తున్నారు. రా-ఎన్టీఆర్ కార్యకలాపాలపై ఫిర్యాదులు అందడంతో స్పందించిన ఎన్టీఆర్ కార్యాలయం, అసలా రా-ఎన్టీఆర్ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ అధికారికంగా లేఖ విడుదల చేశారు.

(తెలుగు సినిమా స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు చేస్తూ, కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘రా ఎన్టీఆర్’ (RAW NTR) సంస్థకు ఎలాంటి సంబంధం లేదని నటుడు ఎన్టీఆర్‌ కార్యాలయం స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయనకు సంబంధించిన సేవా, ప్రజా సంక్షేమ కార్యక్రమాల వివరాలు కేవలం వ్యక్తిగత లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడి అవుతాయని ఈ సందర్భంగా ప్రకటనలో పేర్కొంది.)

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *