జనసేన పార్టీలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
అమరావతి: దివంగత నేత స్వర్గీయ వంగవీటి మోహన రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వంగవీటి రాధాకృష్ణకి పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీ కండువా కప్పి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రాధాకృష్ణ,తనతో వచ్చిన అనుచరులను పవన్ కళ్యాణ్ కి పరిచయం చేశారు. పార్టీ సిద్ధాంతాల కోసం, ప్రజా సేవలో కలిసికట్టుగా పని చేద్దామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను,తదితరులు పాల్గొన్నారు.

