AP&TG

రుషికొండ ప్యాలెస్‌కు కొత్త రూపు

120 రోజుల పాటు ప్రజలకు సందర్శన అవకాశం..

ఆ తర్వాత PPP విధానంలో లగ్జరీ హాస్పిటాలిటీ ప్రాజెక్టు..

ప్రాజెక్టుపై 9 సంస్థల ఆసక్తి..

మరో 4 ఎకరాల్లో 150 గదుల నిర్మాణానికి ప్రతిపాదన..

విశాఖపట్నం: విశాఖపట్నంలోని వివాదాస్పద రుషికొండ ప్యాలెస్ భవనాల భవిష్యత్తుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భవనాలను రాబోయే 120 రోజుల పాటు ప్రజలు సందర్శించేందుకు అనుమతించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. దీంతో నాలుగు నెలల పాటు పర్యాటకులు, సందర్శకులకు రుషికొండ భవనాలను చూసే అవకాశం కలగనుంది.

లగ్జరీ హాస్పిటాలిటీ ప్రాజెక్టు:- 120 రోజుల సందర్శన గడువు ముగిసిన అనంతరం రుషికొండ భవనాలను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో లగ్జరీ హాస్పిటాలిటీ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే తొమ్మిది ప్రముఖ సంస్థలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

మరో నాలుగు ఎకరాల్లో 150 గదులు:- ప్రస్తుత భవనాలతో పాటు అదనంగా మరో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో గరిష్ఠంగా 150 గదుల వరకు నిర్మించేందుకు ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. పర్యాటక, ఆతిథ్య రంగాలకు అనువైన అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దాలని ప్రభుత్వం అలోచిస్తున్నట్లు సమాచారం.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *