పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్
అమరావతి: ముంబయి కోకిలబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని సోమవారం సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు. పవన్ కళ్యాణ్ తో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని దేవేంద్ర ఫడ్నవీస్ ఆకాంక్షించారు.

