DISTRICTS

నెల్లూరు- తడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణకు డీపీఆర్ తయారీ-జిల్లా కలెక్టర్

నెల్లూరు: జాతీయ రహదారి సంఖ్య–16లోని తడ–నెల్లూరు విభాగం-నెల్లూరు బైపాస్‌ను ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల నుండి ఆరు లేన్లుగా విస్తరించేందుకు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ కోసం కన్సల్టెన్సీ సేవలను చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్  హిమాన్షు శుక్ల తెలిపారు. శనివారం నెల్లూరు కలెక్టరేట్‌లో జాతీయ రహదారి ప్రాజెక్టుకు సంబంధించి స్టేక్‌హోల్డర్ల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తడ నుండి నెల్లూరు వరకు రహదారి సామర్థ్యాన్ని పెంచి, పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణికులకు మరింత సురక్షితమైన, వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలను అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని తెలిపారు. జాతీయ రహదారి లో అవసరమైన చోట ట్రాక్ లి బె లను ఏర్పాటు చేయడంతో పాటు పలువురు సభ్యులు లేవేనేత్తిన అంశములను పరిగణలోకి తీసుకోని అవసరమైన చోట ఫ్లై ఓవర్ ల క్రింద ఎత్తు పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. డీపీఆర్ తయారీ ప్రక్రియలో ట్రాఫిక్ సర్వేలు, భూసేకరణ అవసరాల అంచనా, పర్యావరణ ప్రభావ అధ్యయనాలు, వంతెనలు-ఇతర రహదారి మౌలిక సదుపాయాల రూపకల్పన, వ్యయ అంచనాలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించనున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్ గణపతి (నేషనల్ హైవేస్), వై.మురళి సీనియర్ హైవే డిజైన్ ఇంజనీర్ (డీపీర్ కన్సల్టెంట్స్) నుడా చర్మన్ కొటంరెడ్డి శ్రీనివాస రెడ్డి, RTC జోనల్ చైర్మన్ సురేందర్ రెడ్డి,Z.P చైర్మన్ ఆనం అరుణమ్మ, నగర మేయర్ సుజాత, J.C మొగిలి వెంకటేశ్వర్లు,RDOలు నాగ అనూష,అరుణా దేవి, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *