INTERNATIONALNATIONALOTHERS

బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందువులు కాగడాలతో భారీ నిరసన

అమరావతి: దేశంలో మైనార్టీల హక్కులు అంటూ గొంతు చించుకునే కూహన సెక్యూలరీ వాదులు, బంగ్లాదేశ్ లో మైనార్టీలు అయిన హిందువుల దేవుళ్లను అవమాన పరుస్తున్న నోరు మొదపరు ఎందుకంటే వీళ్లకు…? విషయంలోకి వస్తే… మైనారిటీల హక్కులను కాలరాస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి హిందువులు కదంతొక్కారు. రాముడి విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శుక్రవారం రాత్రి కాగడాలతో భారీ నిరసన చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వేలాది మంది హిందువులు, విద్యార్థులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్, గైబంధ జిల్లాలోని పలాష్‌బరి కాంప్లెక్స్‌ దేవాలయ ప్రాంగణంలో 81 అడుగుల రాముడి విగ్రహాన్ని, శ్రీశ్రీ రాధా గోవింద దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతోంది. రాముడి విగ్రహంతోపాటు కృష్ణుడు, శివుడి విగ్రహాల్ని కూడా నిర్మిస్తున్నారు.

ఈ విగ్రహాల నిర్మాణాలు దాదాపు 80 శాతం పూర్తి కావస్తొంది. రాముడి విగ్రహాన్ని నిర్మించవద్దని అక్కడి ముస్లిం సంఘాలు, మత గురువులు హెచ్చరించడంతో,అక్కడి ప్రభుత్వం ఈ విగ్రహ నిర్మాణాన్ని నిలిపివేసింది. రాముడి విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఇటీవల కొన్ని ముస్లిం సంఘాలు నిరసన చేపట్టి, రాముడి చిత్ర పటాన్ని అవమానపరిచాయి. విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడాన్ని, రాముడి చిత్ర పటాన్ని అవమానించడాన్ని నిరసిస్తూ ఢాకాలో హిందువులు, ఢాకాలోని షాబాగ్ ఇంటర్‌సెక్షన్‌ నుంచి నేషనల్ ప్రెస్ క్లబ్ వరకు ర్యాలీ చేశారు. అనేక హిందూ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇందులో పాల్గొన్నాయి. ఢాకాలోని రిపోర్టర్స్ యునిటీ బిల్డింగ్ వద్ద కూడా మరికొందరు నిరసన చేపట్టారు. విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాముడిని అవమానించి వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుల్ని మూడు రోజుల్లోగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

కొత్తగా ఏర్పడ్డ తారిక్‌ రెహమాన్ నాయకత్వంలోని ప్రభుత్వంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీలకు రక్షణ లేకుండా పోతోందని హిందూ సంఘాలు సహా పలు మైనారిటీ సంఘాలు విమర్శిస్తున్నాయి. ముస్లిం మెజారిటీ దేశం కావడంతో హిందు,కైస్తవ మతస్తులపై తరచూ దారుణమైన దాడులు జరుగుతున్నాయి.రాబోయే రోజుల్లో ఈ విషయం ఏ మలుపు తిరుగుతుందొ వేచి చూడాలి.?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *