భారత్-ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరాయి-ప్రధాని నరేంద్ర మోదీ
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని బుధవారం ద్వైపాక్షిక సంబంధాలను “ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం” సరికొత్త శిఖరాలకు చేరాయి. రక్షణ, ఆవిష్కరణ, తయారీ, లాజిస్టిక్స్,సముద్ర రంగాలలో సహకారం కోసం ఒక ప్రతిష్టాత్మకమైన రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. విస్తృతస్థాయి చర్చల అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ,’భారత్-ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-29′ గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.ఇరుదేశాల నాయకుల మధ్య పెరుగుతున్న నిరంతర చర్చలు, సమావేశాలు ఇరుపక్షాల మధ్య బలపడుతున్న సహకారానికి, పరస్పర నమ్మకానికి నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు.
20 బిలియన్ యూరోల లక్ష్యం వైపు:- భారత్-ఇటలీ వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-29 మా భాగస్వామ్యానికి ఒక ఆచరణాత్మక, భవిష్యత్ ఆధారిత రూపాన్ని ఇస్తుంది. మేము దీనిని నిర్దేశిత కాలపరిమితిలోపు పూర్తి చేసే దిశగా ముందుకు వెళ్తున్నాం. అంతేకాదు ఇరుదేశాల మధ్య వాణిజ్యం 20 బిలియన్ యూరోల లక్ష్యం వైపు దూసుకెళ్తోంది. ఇండియాలో ఉన్న 800కు పైగా ఇటాలియన్ కంపెనీలు భారత దేశాభివృద్ధి ప్రస్థానంలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి.
రోమ్–వారణాశికి నాగరికత సంబంధాలు:- భారత్-ఇటలీ మధ్య ఉన్న నాగరికత సంబంధాలను కూడా మోదీ హైలెట్ చేశారు. ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలు కేవలం ఇప్పటివి కావని అన్నారు. ఇటలీ రాజధాని రోమ్ నగరానికి, తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాశి (కాశీ)కి మధ్య ఉన్న చారిత్రక అనుబంధాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు.

