BUSINESSNATIONAL

హోర్ముజ్ జలసంధిని దాటిన 60 లక్షల బ్యారెళ్ల ముడి చమురు

అమరావతి: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో 3 జెయింట్ చమురు ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటి బయటకు వచ్చాయి.దాదాపు 60 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో ప్రయాణిస్తున్న ఈ ట్యాంకర్లు సురక్షితంగా జలసంధిని దాటినట్లు అంతర్జాతీయ షిప్పింగ్ వర్గాలు వెల్లడించాయి. హోర్ముజ్‌ను దాటిన ట్యాంకర్లలో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ దేశాలకు చెందిన చమురు ఉన్నట్లు సమాచారం.గత రెండు నెలల నుంచి పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుని పోయిన ఈ ట్యాంకర్లు ప్రధానంగా ఆసియా మార్కెట్లకు క్రూడాయిల్‌ను తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త రావడంతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 2.5 శాతం మేర తగ్గుదల నమోదు చేసింది.ఇలా చమురు సరఫరాలు అంతరాయం లేకుండా కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు స్థిరపడే అవకాశం ఉందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *