AP&TGCRIME

స్వర్ణముఖి నది ప్రవాహంలో కొట్టుకుని పోయిన నాలుగురు విద్యార్దులు

తిరుపతి:  స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులలో నలుగురు నీటి ప్రవాహానికి గురై గల్లంతయ్యారు. తిరుపతి జిల్లా రూరల్ మండలంలోని వేదాంతపురం సమీపంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం అగ్రహారం గ్రామానికి చెందిన 7 మంది యువకులు నదిలో ఈత కొడుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక దిబ్బలపై ఆడుతూ స్నానం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా పెరిగిన నీటి ప్రవాహానికి నలుగురు యువకులు కొట్టుకుపోయారని తెలిపారు. ముగ్గురు మాత్రం స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత శాఖలకు అప్రమత్తం అవ్వాలని, గల్లంతైన విద్యార్థుల కోసం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత  అధికారులను ఆదేశించారు.

గల్లంతైన యువకులు:- ప్రకాశ్ (17), చిన్న (15), తేజు (19), బాలు (16)గా గుర్తించారని,  రక్షణ సిబ్బంది గాలింపు చర్యలు ప్రారంభించగా, బాలు అనే యువకుడి మృతదేహం బయటపడింది. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.జిల్లా పోలీసులు, రెవెన్యూ, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, బృందాలు, సిబ్బంది సంయుక్తంగా రక్షణ చర్యల్లో పాల్గొంన్నారు.ఇటీవలి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున విద్యార్థులు,,యువకులు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లకూడదని హెచ్చరించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *