NATIONALOTHERSTECHNOLOGY

తొలి మానవసహిత అంతరిక్ష మిషన్​ ‘గగన్​యాన్’​ 2027 నాటికి సిద్ధం-ఇస్రో చైర్మన్

అమరావతి: ఊహశక్తి-సృజనాత్మకతను ఉపయోగించే వ్యక్తి,, ఎక్కువ వనరులు ఉన్న వ్యక్తిని అధిగమిస్తాడని పరోక్షంగా అగ్రదేశాలను ఉద్దేశించి ఇస్రో చైర్మన్​ వీ నారాయణన్​ అన్నారు.బుధవారం ఝార్ఖండ్​ రాజధాని రాంచీలో మెస్రాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BIT) 35వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ నారాయణన్ మాట్లాడుతూ

భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తొలి మానవసహిత అంతరిక్ష మిషన్​ ‘గగన్​యాన్’​ 2027 నాటికి సిద్ధం అవుతుందని వెల్లడించారు. 2040 నాటికి సిబ్బందితో కూడిన చంద్రుడిపై అడుగిడే తొలి యాత్ర చేపట్టాలని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారని ఇస్రో చైర్మన్​ తెలిపారు. అందుకు అనుగుణంగానే 2040 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

80వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్లు తయారీ:- అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం ప్రస్తుతం ఇస్రో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు వెల్లడించారు. 2026లో వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపడం, 2035 నాటికి జాతీయ అంతరిక్ష కేంద్రం, వాటిలో 80వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్లను తయారుచేయడం, చంద్రుడిపై అధ్యయనం కోసం వీనస్ ఆర్బిటర్ మిషన్ (VOM) ఏర్పాటు వంటి లక్ష్యాలను ఏర్పరుచుకున్నామని తెలిపారు. అంతరిక్ష మిషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ బిగ్ డేటా వంటివాటిని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు 2027లో ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-4 ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్  వెల్లడించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *