DISTRICTS

రోడ్డు ఆక్రమణలు తొలగించే ప్రక్రియను పర్యవేక్షించిన కమీషనర్ నందన్

నెల్లూరు: గ్రాండ్ ట్రంక్ రోడ్డులోని వివిధ ప్రాంతాలలో రోడ్డు ఆక్రమణలు తొలగించే ప్రక్రియను కమిషనర్ నందన్ పర్యవేక్షించారు. డ్రైను కాలువలను దాటి ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా సంబంధిత విభాగాల సచివాలయ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ కమిషనర్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక గ్రాండ్ ట్రంకు రోడ్డు గాంధీ బొమ్మ, కనకమహాలు కూడలి, కొత్త హాలు కూడలి, జేమ్స్ గార్డెన్, వెంకట రామాపురం తదితర ప్రాంతాలలో గురువారం పర్యటించారు. వర్షపు నీరు అండర్ బ్రిడ్జిలు,రోడ్లపై చేరి వాహనాల రాకపోకలకు అడ్డంకిగా మారకుండా అన్ని ప్రధాన డ్రైన్ కాలువలతో పాటు అనుసంధాన కాలువల్లో పూడికతీత, సిల్ట్ ఎత్తివేత పనులను వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *