స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు కేబినేట్ అమోదం
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం రాష్ట్ర సచివాలయంలో కేబినేట్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సులను ఆమోదించారు.
కేటగిరీల వారీగా బీసీ రిజర్వేషన్ల వివరాలు:-
మేయర్ పదవులు: 35.29 శాతం
మున్సిపల్ చైర్మన్ పదవులు: 33.02 శాతం
అర్బన్ వార్డులు: 32.78 శాతం
సర్పంచ్ స్థానాలు: 27.95 శాతం
పంచాయతీ వార్డులు: 26.73 శాతం
ఎంపీటీసీ (MPTC) స్థానాలు: 25.55 శాతం
ఎంపీపీ (MPP) పదవులు: 24.60 శాతం
జడ్పీటీసీ (ZPTC) స్థానాలు: 24.60 శాతం
జడ్పీ చైర్మన్ పదవులు: 23.08 శాతంగా వున్నాయి.

