నారీ శక్తి వందన్ చట్ట సవరణ బిల్లుపై కూటమి నేతల సమావేశం
అమరావతి: ఈ నెల 16వ తేది (గురువారం) ఎన్ డి ఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెడుతోన్న నారీ శక్తి వందన్ చట్ట సవరణ బిల్లుపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల సమావేశంమై చర్చించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బిల్లు ఆమోదం పొందాక చేపట్టాల్సిన నారీ శక్తి విజయోత్సవాలు, కార్యాచరణపై ఎన్డీఏ పక్ష నేతల సమాలోచనలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రంలోని వివిధ పార్టీల అధ్యక్షులకు, ఎంపీలకు ఇప్పటికే లేఖలు రాశారు.

