AP&TG

తప్పు ఎవరో చేశారు కాబట్టి మాకు సంబంధం లేదంటే ఎలా? పవన్ కళ్యాణ్

భక్తులకు క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఏంటి

అమరావతి: తప్పు ఎవరిదైనా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది కాబట్టే,, తిరుపతి ఘటనపై తాను భక్తులను క్షమాపణలు అడిగానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు..శుక్రవారం పీఠపురంలో గోకులలను లాఛనంగా ప్రారంభించిన అనంతరం అయన మాట్లాడుతూ ప్రజలిచ్చిన గెలుపుతోనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది…ప్రభుత్వం ఏర్పడింది కాబట్టే మీరు టీటీడీ చైర్మన్,ఈవో, జెఈవో పదవులు అధిష్టించారు..ప్రజలు ఇచ్చిన తీర్పుతో పాలన చేపట్టిన మనం, తప్పు జరిగితే క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఏంటని ప్రశ్నించారు..తప్పు ఎవరో చేశారు కాబట్టి మాకు సంబంధం లేదంటే ఎలా అంటూ ప్రశ్నించారు ? ఎడు చేపలు కథ చెప్ప వద్దన్నారు..టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్ నాయుడు,, ఈవో శ్యామలరావు,,,జెఈవో వెంకన్నచౌదరి,,బోర్డు సభ్యులు కూడా కచ్చితంగా ప్రెస్‌మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాల్సిందే అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు..తిరుపతిలో సంఘటన జరిగిన తరువాత బాధితులను ఆస్పత్రిలో కలసి మాట్లాడుతుంటే కళ్లు చమ్మగిల్లాయన్నారు..అలాంటి వారికి క్షమాపణ చెప్పకుంటే ఎలా…? క్షమాపణలు చెప్పిన మరణించిన వారిని తీసుకుని రాలేమని అవేదన వ్యక్తం చేశారు..అధికారులు క్రౌడ్ మేనేజ్ మెంట్ చేయడంలో విఫలం అయ్యారని,,పరిస్థితిని ఎలా అదుపు చెయ్యాలో సరైన ఆలోచన లేక 11 వందల మంది పోలీసులు ఏం చేయలేకపోయారన్నారు..

ప్రజలు సంక్రాంతి సంబరాలు జరుపుకోలేకపోతున్నారు:- అధికారులు చేసిన తప్పుకు ప్రజలు సంక్రాంతి సంబరాలు జరుపుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..సనాతన ధర్మం పాటించే హిందువులును క్షమాపణ అడిగాను… ఎవరి భాద్యత వాళ్ళు నిర్వర్తించి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కాదన్నారు.. ఎక్కడ ఎలా స్పందించాలో యువత కూడా ఆలోచించాలి అని,, చావులు దగ్గర కేరింతలు,, అరుపులు భావ్యం కాదని పవన్ హితబోధ చేశారు.. ప్రజలిచ్చిన గెలుపుతోనే టీటీడీ చైర్మన్ అయినా.. ఈవో అయినా.. సీఎం చంద్రబాబు, తానైనా.. అందుకే టీటీడీ అధికారులు కూడా కచ్చితంగా ప్రెస్‌మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి బాధితులు ఆస్పత్రిలో మాట్లాడుతుంటే కళ్లు చమ్మగిల్లాయి. పరిస్థితిని ఎలా అదుపు చెయ్యాలో సరైన ఆలోచన లేక 11 వందల మంది పోలీసులు ఏం చేయలేకపోయారు.

పిఠాపురంలో పోలీస్ తీరు:- పిఠాపురంలో పోలీస్ తీరు బాగోలేదని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దొంగతనాలు బాగా పెరిగాయంటూ ఫిర్యాదులు సైతం తనకు వచ్చాయని తెలిపారు. అలాగే పిఠాపురంలో గంజాయి వినియోగం సైతం పెరిగిందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయని చెప్పారు. వీటిని పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లి.. ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదంటూ తనకు ఫిర్యాదు దారులు చెబుతున్నారన్నారు.

మహిళలను వేధిస్తే తొక్కి నారతీస్తా:- అలాగే తప్పు చేసే వాళ్లను కూటమి ప్రభుత్వంలో ఎవరూ వెనకేసుకు రారన్నారు పవన్ కళ్యాణ్. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అధికారులకు హనీమూన్ పిరియడ్ అయిపోయిందని,, లా అండ్ ఆర్డర్ విషయంలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే తొక్కి నార తీస్తానని హెచ్చరించారు. తాను తెగించి రాజకీయాల్లోకి వచ్చానని,, మందుపాతరలు పెట్టి పేల్చుతామన్నా భయపడేది లేదని,, ఆకు రౌడీలు,, చిల్లర వేషాలు వేసేవాళ్లకు అస్సలు భయపడనని పరోక్షంగా హెచ్చరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *