సీఎం చంద్రబాబు అధ్యక్షతన7వ జిల్లా కలెక్టర్ల సదస్సు
అమరావతి: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది. బిజినెస్ రిఫార్మర్ అవార్డు దక్కించుకున్న సీఎంకు మంత్రులు, కలెక్టర్లు, అధికారులు అభినందనలు తెలిపారు. ప్రజా అవసరాలే ప్రభుత్వ ప్రాధాన్యతలనే లక్ష్యంతో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. పరిపాలనలో ప్రభుత్వ సమర్థత మరింత పెంచేలా సదస్సులో చర్చిస్తున్నారు. పరిపాలనలో ప్రభుత్వ సమర్థత మరింత పెంచేలా చర్చలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించడమే లక్ష్యంగా సదస్సు నిర్వహిస్తున్నారు. ఇవాళ 10 సూత్రాలు, జిల్లాలవారీగా జీఎస్డీపీ వృద్ధి, కేంద్ర పథకాలపై సమీక్ష జరుగుతోంది. ఫిర్యాదుల పరిష్కారం, కంపెనీల గ్రౌండింగ్, దస్త్రాల క్లియరెన్స్‌పై ఇవాళ సమీక్ష జరుగుతోంది. సింగపూర్ పర్యటనలో అధ్యయనం చేసిన అంశాలను మంత్రులు వెల్లడించనున్నారు.
సమాచార పౌరసంబంధాల శాఖపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐఅండ్‌పీఆర్ వ్యవస్థ పని చేయకుండా ఆభరణంలా మారిందన్నారు. ఇన్‌ఫ్లూయెన్స్‌ర్ల సహాయంతో పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అధికారుల పనితీరు అభివృద్ధిని అడ్డుకునేలా ఉండటం సరికాదన్నారు. పోడు వ్యవసాయాన్ని అడ్డుకుంటే అరకులో కాఫీ పంట ఉంటుందా అని ప్రశ్నించిన సీఎం, అధికారుల ప్రవర్తన మార్చుకొని అభివృద్ధికి ఊతమివ్వాలని హితవు పలికారు

