INTERNATIONALMOVIESNATIONALOTHERS

హాలీవుడ్ దిగ్గజ నటుడు సామ్ నీల్ మృతి

అమరావతి: హాలీవుడ్ చిత్ర రంగంలో తన అద్భుత నటనతో దశాబ్దాల పాటు కోట్ల మంది ప్రేక్షకులను అలరించిన నటుడు సామ్ నీల్ (78) కన్నుమూశారు.సోమవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆయన తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత కొంతకాలంగా క్యానర్స్ సమస్యలతో బాధపడుతున్న చికిత్స ద్వారా కోలుకున్నప్పటికి ఫలితం లేకపోయిందని తెలిపారు. ఆయన మరణం హాలీవుడ్ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సామ్ నీల్ మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సామ్ నీల్ అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అబిమానలకు మొదట గుర్తొచ్చే పాత్ర Jurassic Park చిత్రంలోని డాక్టర్ అలన్ గ్రాంట్,  స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఈ క్లాసిక్ సిరీస్‌లో డైనోసార్ల నిపుణుడిగా ఆయన పోషించిన పాత్ర సినిమా చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *