ఈ జిల్లాల్లో శుక్రవారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
అమరావతి: రాష్ట్రంలో మండే ఎండలతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 152 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఉష్ణోగ్రతలు:– 45°C- 46°C:విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం,కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా. 43°C-44°C: శ్రీకాకుళం,విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్,గుంటూరు, బాపట్ల,పల్నాడు,మార్కాపురం, ప్రకాశం,నెల్లూరు. 40°C – 42°C:రాయలసీమ జిల్లాలు.
శుక్రవారం పిడుగులతో కూడిన వర్షాలు:- ద్రోణి ప్రభావంతో రేపు మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

