AP&TG

ప్రభుత్వం యోగా & నేచరోపతి సలహాదారుగా మంతెన సత్యనారాయణ నియమకం

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు రాష్ట్ర ప్రభుత్వ యోగా, ప్రకృతి వైద్య సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును నియమిస్తూ ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మంతెనకు యోగా & నేచరోపతి విభాగానికి సలహాదారుగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేబినెట్ హోదాతో పాటు హానరరీ అడ్వైజర్‌గా బాధ్యతలు అప్పగించింది. రెండు సంవత్సరాల పదవీకాలం వరకు ఆయన సేవలు కొనసాగనున్నాయి. వాహనం, కార్యాలయం, సిబ్బంది సౌకర్యాలతో పాటు అధికారిక పర్యటనలకు ట్రావెల్ అలవెన్స్ కూడా కల్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయపై వైద్య ఆరోగ్యశాఖ అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ జి. సాయి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *