AP&TG

రాష్ట్రంలో బుధవారం తేలికపాటి వర్షాలు-విపత్తుల నిర్వహణ సంస్థ

హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో కుండపోత…

అమరావతి: రాష్ట్రంలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

బుధవారం తేలికపాటి వర్షాలు:- అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

బుధవారం ఉష్ణోగ్రతలు:- మరోవైపు విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41- 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40- 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

మంగళవారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు:- అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 42.7 డిగ్రీలు, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 42.4, మన్యం జిల్లా భామినిలో 42.2, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 42, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, కాకినాడ జిల్లా పిఠాపురంలో 41.6, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, విశాఖ జిల్లా అక్కిరెడ్డిపాలెం 41.5 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో కుండపోత:- ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షం.. జలమయమైన హైదరాబాద్‌ రోడ్లు. సైబరాబాద్ పరిధిలో స్తంభించిన ట్రాఫిక్.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌ సిటీలో భారీగా నిలిచిన వాహనాలు. సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, నారాయణఖేడ్, మహబూబాబాద్‌, వరంగల్ జిల్లాల్లోనూ భారీ వర్షపాతం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *