ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ కేసును విచారించేందుకు టీఎంసీ కార్యలయంకు వెళ్లిన సీఐడీ బృందం
అమరావతి: TMC ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ (CID) బృందం మంగళవారం మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసానికి వెళ్లారు.ఇప్పటికే అస్థిరంగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాజకీయ పరిస్థితుల్లో నాటకీయ పరిణామాలకు దారితీసింది. స్థానిక పోలీసులు,పెద్ద సంఖ్యలో మహిళా పోలీసు అధికారులతో కూడిన రాష్ట్ర దర్యాప్తు సంస్థ బృందం,కేసు విచారణలో భాగంగా ఖాళీఘాట్‌లోని 30B మధ్యాహ్నం హరీష్ ఛటర్జీ వీధిలో ఉన్నమమతా బెనర్జీ నివాసానికి (ఇదే తృణమూల్ కాంగ్రెస్ కేంద్ర పార్టీ కార్యాలయంగా కూడా పనిచేస్తోంది) చేరుకుంది. ఈ నివాసం 30B హరీష్ ఛటర్జీ వీధిలో ఉంది.
విచారణలో భాగంగానే:- తొలుత ఖాళీఘాట్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని వెంట తీసుకుని సీఐడీ బృందం టీఎంసీ కార్యాలయానికి వెళ్లింది. కార్యాలయం వద్ద వేచిచూస్తుండగా వారిని కలిసేందుకు టీఎంసీ మాజీ ఎంపీ, పార్టీ కోశాధికారి సుభాశిష్ చక్రవర్తి బయటకు వచ్చారు. మమతా బెనర్జీ , టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీలు ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీలో ఉన్నారని సీఐడీ బృందానికి చక్రవరి తెలియజేశారు. వారు లేకుండా లోపలకు అనుమతించలేమని చెప్పారు. అయితే విచారణలో భాగంగానే తాము వచ్చామనీ, సంబంధితులు ఎవరూ ఉండాల్సిన పని లేదని సీఐడీ అధికారుల తెలిపారు. అభిషేక్‌కు ఇచ్చిన నోటీసును చూపిస్తూ, సెర్చ్ ఆపరేషన్‌కు సహకరించాలని కోరారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. కామాక్ స్ట్రీట్‌లోని అభిషేక్ బెనర్జీ నివాసానికి కూడా ఒక సీఐడీ టీమ్ వెళ్లిందని సమాచారం.
నకిలీ సంతకాల కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్‌ను సహకరిస్తున్న సీఐడీ టీమ్ గత మే 30న తొలిసారి అభిషేక్ ఖాళీఘాట్ నివాసానికి వెళ్లింది. జూన్ 1న విచారణకు హాజరుకావాలని కోరింది. అయితే తనకు 14 రోజులు గడువు ఇవ్వాలని అభిషేక్ కోరారు. ఆయన చేసిన విజ్ఞప్తిని సీఐడీ తోసిపుచ్చింది. వారం రోజుల్లోగా తమ ముందు హాజరుకావాలని తాజా నోటీసు ఇచ్చింది. అయితే సోమవారంతో ఆ గడువు ముగిసినప్పటికీ సీఐడీ విచారణకు అభిషేక్ హాజరుకాలేదు.
అసెంబ్లీకి సమర్పించిన పత్రాలపై:- పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా శోవన్‌దేబ్ ఛటోపాధ్యాయ, ప్రతిపక్ష ఉపనాయకులుగా అసిమా పాత్రా, నైనా బంద్యోపాధ్యాయ, చీఫ్ విప్‌గా ఫిర్హాద్ హకీంల నియామకానికి సంబంధించి అసెంబ్లీకి సమర్పించిన పత్రాలపై పలువురు టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.

