భారతీయ సంతంతికి చెందిన 800 మంది కళాకారిణిలు అధ్బుతమైన నృత్య ప్రదర్శన
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తన రెండు రోజుల మలేషియా పర్యటనలో బాగంగా శనివారం కౌలాంపుర్ కు చేరుకున్నారు.ప్రదాని మోదీకి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీమ్,స్వయంగా ఎయిర్ పోర్టుకు చేరుకుని స్వాగతం పలికారు.అనంతరం ప్రధాని మోదీ భారతీయ సంతంతికి చెందిన వారితో మాట్లాడేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారతీయ సంతంతికి చెందిన దాదాపు 800 మంది కళాకారిణిలు అధ్బుతమైన నృత్య రూపాలను ప్రదర్శించారు.ఈ ప్రదర్శనను మలేషియా ప్రదాన మంత్రి అన్వర్ ఇబ్రహీమ్ తో కలసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తిలకించారు.
