INTERNATIONALOTHERS

భారత్‌, 80 కోట్ల మంది ప్రజలను స్మార్ట్‌ఫోన్ల వాడకం ద్వారా పేదరికం నుంచి బయటపడేసింది

అమరావతి: భారత్‌ డిజిటల్ టెక్నాలాజీని ఉపయోగించుకుని ఆర్దిక విప్లవాన్ని తీసుకుని వచ్చిందని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది.. డిజిటల్ టెక్నాలాజీ ద్వారా గత 5 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలను కేవలం స్మార్ట్‌ఫోన్ల వాడకం ద్వారా పేదరికం నుంచి బయటపడేసిందని ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు..ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు..భారత్‌లోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాకింగ్‌ సేవలను విస్తరించడంపై హర్షం వ్యక్తం చేశారు.. డిజిటలైజేషన్‌ అనేది ఒక దేశం వేగవంతంగా అభివృద్ధి చెందేందుకు కారణం అవుతుందన్నారు..గతంలో భారత్‌లోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు, ఆన్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థలు అందుబాటులో ఉండేవి కావు అని,,ప్రస్తుతం  గ్రామీణ రైతులు పేమెంట్స్ అందుకోవడం, బిల్లులు చెల్లించడం వంటివి స్మార్ట్‌ఫోన్ ద్వారానే క్షణల్లో పూర్తి చేస్తున్నారని అన్నారు.. బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసి, దేశ ప్రజలు ప్రయోజనం పొందడానికి భారత్‌లో ఇంటర్‌నెట్‌ అందుబాటులోకి తీసుకుని రావడం ఎంతగానో తోడ్పడుతోందన్నారు..ప్రపంచంలో మిగిలిన దేశాలు కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఇటువంటి చర్యలు తీసుకోవాలి’ అని ఆయన సూచించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *