క్యు-శివ పేరుతో రూపొందించిన ఐదు క్వాంటం కంప్యూటర్లను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
ప్రపంచంలో కేవలం రెండు మూడు చోట్ల మాత్రమే..
అమరావతి: పాన్ ఐఐటీ అమరావతి సమ్మిట్‌లో క్యూ-శివ పేరుతో రూపొందించిన ఐదు క్వాంటం కంప్యూటర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రారంభించారు.క్యూబిట్ ఫోర్స్ కు చెందిన క్యూ-శివ క్వాంటం కంప్యూటర్లను పాన్ ఐఐటీ సదస్సులో ఆవిష్కరించారు. మినీ టెస్టింగ్ క్యాంటం కంప్యూటర్ ల్యాబులుగా క్యూ- క్వాంటం కంప్యూటర్లు ఉపయోగపడనున్నాయి. 4 కెల్విన్ ప్రాసెసర్-సృష్టిని కూడా సీఎం ప్రారంభించారు. క్యాంటం శివ కంప్యూటర్ల తయారీలో కీలకంగా వ్యవహరించిన ఛండీఘడ్ యూనివర్సిటీ, క్యూబిట్ ఫోర్స్ ప్రతినిధుల్ని సీఎం చంద్రబాబు అభినందించారు.
ప్రపంచంలో కేవలం రెండు మూడు చోట్ల మాత్రమే:- క్వాంటం శివ కంప్యూటర్ల తయారీకి అవసరమైన కాంపొనెంట్లల్లో కొన్ని, ప్రపంచంలో కేవలం రెండు మూడు చోట్ల మాత్రమే లభిస్తాయిని క్యూబిట్ సంస్థ సీఈఓ వెంకటసుబ్రమణ్యం తెలిపారు. అలాంటి ఆరుదైన కాంపోనెంట్లు మచిలీపట్నంలో లభిస్తున్నాయని వెల్లండిచారు. తమకు సీఎం చంద్రబాబు ఇచ్చిన సహాకారాన్ని మరిచిపోలేమన్న క్యూబిట్ సీఈఓ అన్నారు.అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, క్యూబిట్ సంస్థ ప్రతినిధులతో కలిసి సెల్ఫీ దిగారు.

