AP&TG

రాష్ట్రంలో ఆదివారం పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం-విపత్తుల నిర్వహణ సంస్థ

అమరావతి: ఆదివారం అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయడం జరిగిందన్నారు. గుంటూరు,పల్నాడు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ వుందని, చెదురు మదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కరిసే అవకాశం వుందని పేర్కన్నారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు,సంగం, చేజర్ల, పల్లకొండ, పొదలకూరు, నెల్లూరు, రాపూరు,కొవ్వూరు పరిసర ప్రాంతాలలో పిడుగులతో మోస్తరు వర్షం కురిసే అవకాశం వున్నదని వెల్లడించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *