టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్‌లో) ఉద్యోగాలకు వాక్-ఇన్ డ్రైవ్
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో ప్రముఖ బహుళజాతి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ – డేటా ప్రాసెసింగ్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక కొరకు వాక్-ఇన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్ లోకనాధం తెలిపారు.
అర్హతలు:- B.Com, B.A, BBA, BBM, BMS, BAF, BBI, B.Sc (CS & IT మినహా) విద్యార్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 2025, 2026 బ్యాచ్‌ల గ్రాడ్యుయేట్లు మాత్రమే అర్హులు. ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ షిఫ్ట్‌లోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి.
వాక్-ఇన్ వివరాలు:-తేదీ: 07-10-2026 (బుధవారం)
సమయం: ఉదయం 9:00 నుంచి 10:30 గంటల వరకు
వేదిక: అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, తిరుపతి.
అభ్యర్థులు రెజ్యూమ్, విద్యార్హతల ఒరిజినల్ ధ్రువపత్రాలు, స్కాన్ కాపీలు, ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకురావాలి.
అభ్యర్థులు తప్పనిసరిగా TCS NextStep పోర్టల్‌లో BPS కేటగిరీ కింద నమోదు చేసుకోవడంతో పాటు, AP Naipunyam పోర్టల్‌లో కూడా నమోదు చేసుకోవాలి.
TCS NextStep: https://nextstep.tcsapps.com/indiacampus/#/registration
Naipunyam: https://naipunyam.ap.gov.in/
మరిన్ని వివరాలకు 90527 17078 నంబర్‌లో సంప్రదించవచ్చు.
అర్హత కలిగిన యువత ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కోరారు.

