ఏపి హై కోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు జడ్జిలు బాధ్యతల స్వీకరణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హై కోర్టుకు శాశ్వత న్యాయమూర్తులుగా అదనపు న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించారు. ఏపి హై కోర్టు మొదటి కోర్టు హాల్లో పుల్ బెంచ్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ కుంచం మహేశ్వరరావు,జస్టిస్ తూట చంద్ర ధనశేఖర్ (టీసీడీ శేఖర్),జస్టిస్ చల్లా గుణ రంజన్,జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ,జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణ రావులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర హై కోర్టులో ఐదుగురు శాశ్వత న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయగా ఈ5గురు శాశ్వత న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు,బార్ కౌన్సిల్ ప్రతినిధులు,హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సభ్యులు,సీనియర్ న్యాయ వాదులు,న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు,న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

