భవన నిర్మాణం జరిగే సమయంలో కళ్ళుమూసుకొని కుర్చున్నరా-హైకోర్టు
హైదరాబాద్: భవన నిర్మాణం జరిగే సమయంలో కళ్ళుమూసుకొని కుర్చుని,,నిర్మాణం పూర్తయ్యాక కూల్చడం ఏంటి ? అని మున్సిపల్ అధికారులపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది.హైదరాబాద్ శేరిలింగంపల్లి పరిధిలోని గుట్టల బేగంపేటలో ఒక వ్యక్తి భవనాన్ని అక్రమ నిర్మాణం అని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు..దీంతో అన్యాయంగా తన భవనాన్ని కూల్చేశారని బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు..బాధితుడి పిటిషన్ పట్ల విచారణ జరిపి, మున్సిపల్ అధికారుల పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

