NATIONAL

భారత్, ఇతర దేశాలతో ఆర్థిక సంబంధాల్ని బలోపేతం చేసేలా కృషి చేస్తొంది-ప్రధాని మోదీ

అమరావతి: ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఆంక్షలు (ట్రేడ్ బారియర్స్) పెరుగుతున్న సమయంలో భారతదేశం మాత్రం ఇతర దేశాలతో ఆర్థిక సంబంధాల్ని బలోపేతం చేసేలా ఆర్థిక వారధుల్ని నిర్మిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.2014 నుంచి ఇప్పటివరకు భారత్ దాదాపు 40 దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ (FTA- స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు) కుదుర్చుకుందని ప్రధాని వెల్లడించారు.శుక్రవారం దిల్లీలో జరిగిన BRICS బిజినెస్ ఫోరమ్ లీడర్స్ సెషన్‌లో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాపారాలకు అడ్డంకుల్ని తొలగించడం, ఈ రంగంలో సరికొత్త అవకాశాల్ని మరింత విస్తరించడంపైనే భారత్ దృష్టి సారిస్తుందని, ఇదే తమ విధానమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సెప్టెంబర్ 12,13 తేదీల్లో దిల్లీ భారత్ మండపం వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనున్న నేపధ్యంలో దాని ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా సమావేశం నిర్వహించారు. స్టార్టప్స్, MSMEలకు భారతదేశంలో ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు.ఇదే సెషన్‌లో యూపీఐ డిజిటల్ పేమెంట్స్(UPI) గురించి కూడా ప్రస్తావించారు. భారత్ బ్రిక్స్‌ కు అధ్యక్షత వహిస్తున్న ఈ సమయంలో వ్యవసాయం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ గ్రిడ్స్ వంటి రంగాల్లో కొత్త సహకార నెట్‌వర్క్‌ లను ఏర్పాటు చేశాం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *