పాన్-ఇండియా నెం-1 హిరోయిన్ గా రష్మిక మందన్న
అమరావతి: చిత్ర పరిశ్రమలో పాన్-ఇండియా స్టార్‌గా దూసుకుపోతున్న రష్మిక మందన్న మరో అరుదైన ఘనతను సాధించింది. మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ తాజాగా నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో రష్మిక దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా మొదటి స్థానంను సొంతం చేసుకుంది. గత నాలుగేళ్లుగా ఈ సర్వేలో అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను వెనక్కి నెట్టి రష్మిక ఈ నంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకుంది.

