AP&TG

కాంతి రాణా టాటా,విశాల్ గున్నిలపై సస్పెన్షన్‌ను తొలగించిన ప్రభుత్వం

అమరావతి: రాష్ట్రంలోని ఇద్దరు సీనియర్ IPS అధికారులపై విధించిన సస్పెన్షన్‌ను ప్రభుత్వం తొలగించింది.2004 బ్యాచ్‌కు చెందిన కాంతి రాణా టాటా, 2010 బ్యాచ్‌కు చెందిన విశాల్ గున్నిలను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

కాంతి రాణా టాటా, విశాల్ గున్నిలపై 2024 సెప్టెంబర్ 15న ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అప్పటి నుంచి వీరి సస్పెన్షన్‌ను ప్రభుత్వం  పొడిగిస్తూ వచ్చింది. పొడిగింపు రేపటితో ముగియనున్న సమయంలో ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ద్వారా వారిపై సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ తిరిగి విధుల్లోకి తీసుకుంది. ఈ ఇద్దరు అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకున్నప్పటికీ ప్రస్తుతం వారిపై కొనసాగుతున్న క్రమశిక్షణా చర్యలు, క్రిమినల్ కేసుల విచారణ యథాతథంగా కొనసాగుతాయని సర్కార్ స్పష్టం చేసింది.

ఫోర్జరీ పత్రం ఆధారంగా ముంబయి నటి కాదంబరీ జెత్వానీపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై IPS అధికారులు అయిన సీతారామాంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్​గున్ని చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు.YSRCP నాయకుడైన విద్యాసాగర్‌తో కుమ్మక్కై, కుట్రకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. రాజకీయ నేతలు ప్రేరేపించడంతో తప్పుడు రికార్డులు సృష్టించి కాదంబరీ జెత్వానీ కుటుంబ సభ్యులపై అక్రమ కేసు బనాయించి వేధించారు. దీంతో ప్రభుత్వం వీరిని సస్పెండ్ చేసింది. ఇదే కేసులో నిందితుడిగా ఉంటూ సస్పెండ్ అయిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ఆగస్టు​లో పదవీ విరమణ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *