రానున్న 3 రోజులు వర్షాలు-బంగాళాఖాతంపై ఏర్పడిన ద్రోణి
అమరావతి: రానున్న 3 రోజులు వర్షాలు బంగాళాఖాతంపై ఏర్పడిన ద్రోణి-ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. బుధవారం పార్వతీపురంమన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణశాఖాధికారులు పేర్కొన్నారు.

