NATIONAL

పాకిస్థాన్ ప్రభుత్వం,ISIలు కలసి ముందు జాగ్రత్తగా హఫీజ్ సయీద్‌కు భద్రత ఏర్పాట్లు

ప్రతీకారం లారెన్స్ బిష్ణోయి…

అమరావతి: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కోవర్ట్‌ ఆపరేషన్ జరుగుతుందని భయపడుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం, ఐఎస్‌ఐ ముందు జాగ్రత్త చర్యలుగా ఉగ్రవాద నేతలను రక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.. లష్కరే, జమాత్-దావా చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం, ఐఎస్‌ఐ భద్రతను పెంచాయని వార్తలు వస్తున్నాయి..ఎవరిని నమ్మలేని స్థితిలో వున్న ISI,,పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూపునకు చెందిన మాజీ కమాండోలను హఫీజ్ సయీద్‌ భద్రత కోసం నియమించారు.. లాహోర్‌లోని మొహల్లా జొహార్‌లో ఉన్న హఫీజ్‌ ఇంటితో పాటు అతడికి ఉన్న మరిన్ని ఇళ్ల వద్ద కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసింది..పాకిస్థాన్ పౌరుల ఇళ్లు, మసీదు, మదర్సా ఉన్న ప్రాంతల్లో హఫీజ్ సయీద్‌ను పాక్ సర్కారు ఉద్దేశపూర్వకంగా జనాలు ఉండే ప్రాంతంలో అతడిని ఉంచింది.. హఫీజ్‌ సయీద్‌ లక్ష్యంగా భారత్‌ దాడి చేయొచ్చని భావిస్తున్న పాకిస్తాన్,, అదే జరిగితే జనాలను రక్షణ కవచాల్లా ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం..2008 ముంబై దాడుల తర్వాత అమెరికా, భారత్‌ “వాంటెడ్‌” లిస్టులో హఫీజ్ సయీద్‌ను ఉన్నాడు..పహల్గాం దాడి నేపథ్యంలో అతడిపై ప్రతీకారం తీర్చుకుంటామని లారెన్స్ బిష్ణోయి సిండికేట్ కూడా బుధవారం పేర్కొంది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *