NATIONAL

రోడ్లు అనేవి ప్రజల రాకపోకలు సాగించేందుకు-నమాజ్ వద్దు-సీ.ఎం యోగీ

అమరావతి: రోడ్లపై నమాజ్ చేసే ముస్లింలు, రోడ్లపై నమాజ్ చేయకుండా సంయమనం పాటించాలని, చట్టం అందరికీ సమానమేని లఖ్‌నవూలో సోమవారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై విధంగా వ్యాఖ్యనించారు.’రోడ్లు అనేవి ప్రజల రాకపోకల సాగించేందుకు నిర్దేశించినవి అని అలాంటి రోడ్లపై నమాజ్ పేరుతో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే ఊరుకోను అని కీలక హెచ్చరికలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రోడ్లపై నమాజ్‌లు చేయరా అని తరచూ కొందరు నన్ను అడుగుతుంటారు.అలాంటివి యు.పిలో వుండవని నేను సమాధానం ఇస్తాను.కావాలంటే వెళ్లి చూసుకోమంటాను. రోడ్లున్నవి ప్రజా రవాణా కోసం. ఎవరైనా రోడ్ల కూడళ్ల వద్దకు వచ్చి ట్రాఫిక్‌ను దిగ్బంధించవచ్చా? ప్రజారవాణాకు అంతరాయం కలిగించే హక్కు వారికి ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. మరికొందరు, తాము ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా నమాజ్ చేయకుండా ఉండటం సాధ్యం కాదు కదా అంటారు. దానికి మా సమాధానం ఒక్కటే. మసీదుల్లో షిప్టుల ప్రకారం నమాజ్ చేసుకోండి. ఇంట్లో స్థలం లేకుంటే దానికి తగ్గట్టుగా కుటుంబాని నియంత్రించుకోండి,జనాభాను పెంచుకోవద్దు. చట్టం అందరికీ సమానమే. ప్రభుత్వ నిబంధనలు కూడా చట్టంతో సమానం అని యోగి వ్యాఖ్యానించారు.

https://x.com/myogiadityanath/status/2056277917513163098?s=20

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *