AP&TGCRIME

అవినీతి తిమింగలం-రూ.100 కోట్ల విలువైన ఆస్తులతో పాటు కేజీ బంగారం, కోటి రూపాయల నగదు

హైదరాబాద్: తెలంగాణలో అతిపెద్ద అవినీతి తిమింగలం పట్టుబడింది. హైదరాబాద్‌లోని జలమండలి మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ నివాసంతో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ నిర్వహించిన సోదాల్లో రూ.100 కోట్ల విలువైన ఆస్తులతో పాటు కేజీ బంగారం, కోటి రూపాయల నగదు పట్టుబడింది. మంగళవారం ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కుమార్ ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కుమార్ నివాసంలో కుప్పలు తెప్పలుగా అవినీతి సొత్తు వెలుగుచూసింది. నగదు లెక్కించడం కోసం కౌంటింగ్ మెషిన్లు వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు స్వాధీనం చేసిన నగదు, ఆస్తుల వివరాలపై ఆరా తీస్తున్న దర్యాప్తు బృందం సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.అలాగే ఏసీబీ అధికారులు కుమార్ బ్యాంకు లాకర్లు తెరవనున్నారు. ఇవి తెరిస్తే అక్రమాస్తుల చిట్టా మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు బావిస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *