దేశంలో ప్రైవేట్ రంగంలో తొలి యుద్ధ విమానాల తయారీ కర్మాగారం ప్రారంభించిన ప్రధాని మోదీ
అమరావతి: భారతదేశంలోనే ప్రైవేట్ రంగంలో తొలి యుద్ధ విమానాల తయారీ కర్మాగారం ప్రారంభం అయింది.. గుజరాత్‌లోని వడోదరలో ఏర్పాటు చేసిన C-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,,స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ తో కలిసి సోమవారం ఉదయం ప్రారంభించారు..టాటా అడ్వాన్డ్స్ సిస్టమ్స్ లిమిటెడ్‌కు చెందిన ఈ కర్మాగారానికి 2022లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు..భారత్‌కు మొత్తం 56 C-295 యుద్ధ విమానాల సరఫరాకు 2021 సెప్టెంబరులో రూ.21,935 కోట్ల మేర స్పెయిన్‌తో ఒప్పందం కుదిరింది.. ఇందులో భాగంగా 16 విమానాలు స్పెయిన్‌లోని ఎయిర్‌బస్ సంస్థ అందచేసి,,మిగిలిన 40 విమానలను వడోదర యూనిట్‌లోనే తయారు చేస్తారు..ఈ ఒప్పందంలో భాగంగా స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ తయారు చేసిన C-295 మీడియం టాక్టికల్ ట్రాన్స్‌పోర్ట్ విమానం గతేడాది సెప్టెంబర్‌లో వాయుసేన అమ్ములపొదిలోకి చేరింది.. ప్రైవేట్ కన్సార్టియం ఆధ్వర్యంలో భారత్‌లో తయారయ్యే తొలి సైనిక విమాన ప్లాంట్ ఇదే.. C-295 అత్యాధునిక రవాణా విమానంగా పేరు వుంది..ఈ విమానంలో 71 మంది సైనిక దళాలను,,50 పారాట్రూపర్లను ఇది చేరవేస్తుంది.. ప్రస్తుత పెద్ద విమానాలు వెళ్లలేని ప్రాంతాలకు సైతం C-295 ఎయిర్‌క్రాఫ్ట్‌లు యుద్ధసామాగ్రిని,, సైనికులను సులభంగా తరలిస్తాయి.. సుదీర్ఘకాలంగా వైమానిక దళంలో సేవలు అందిస్తోన్న ఆవ్రో-748 విమానాల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు..