AP&TGPOLITICS

రాజ్యసభ సీట్ల సర్దుబాటు-తెలుగుదేశం పార్టీ 3, జనసేన పార్టీ ఒక స్థానం

అమరావతి: రాజ్యసభ సీట్లపై ఎన్డీఏ సమావేశంలో టీడీపీ,జనసేన,బీజెపీ అగ్రనేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతిలోని ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో గురువారం అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ 3, జనసేన పార్టీకి ఒక స్థానం కేటాయించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనపై ఉమ్మడి కార్యాచరణ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.

జనసేన రాజ్యసభ అభ్యర్థి ఎవరనేది పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.అలాగే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్వహించే కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారని చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *