NATIONAL

గురువారం కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

అమరావతి: రోహిణి కారై ప్రభావంతో భీకరమైన ఎండలతో తల్లాడిపోతున్న దేశ ప్రజలకు ఐఎండీ చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించాయి.కేరళం అంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు, దక్షిణ తమిళనాడులో కొన్ని ప్రాంతాలు రుతుపవనాలు తాకాయి.దీంతో దేశంలో వర్షాకాలం మొదలైనట్లు ఐఎండీ ప్రకటించింది. రుతుపవనాలు ప్రవేశంతో అక్కడ విస్తృతంగా వర్షాలు కురుస్తుండగా, రానున్న రోజుల్లో ఇవి దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *