దేశంలో భారీ కుట్రకు వందల మంది ఉగ్రవాదులను ల్యాంచ్ ప్యాడ్ ల వద్ద సిద్దం చేసిన పాకిస్తాన్
అమరావతి: భారతదేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ తన నీచమైన బుద్దిని ఎన్నటికి మార్చుకోదు అనేందుకు నిఘా వర్గాలు అందించిన సమాచారంమే నిదర్శనం..జమ్మూకశ్మీర్ లో మరోసారి తీవ్రమైన అలజడి సృష్టించడం కోసం పాకిస్థాన్,దాదాపు 800 మంది ఉగ్రవాదుల ను భారత్లోకి పంపేందుకు భారీ కుట్రకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాట్లు భద్రతదళాలకు సమాచారం అందింది. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ, ఆ దేశ సైన్యం కలిసి ఈ ప్రణాళికలు రచిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు బుధవారం హెచ్చరించాయి. ఉగ్రవాదులను భారత భూబాగంలోకి చొప్పించడం కోసం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి, అంతర్జాతీయ సరిహద్దుల వద్ద సుమారు 70 ఉగ్రవాద లాంచ్ప్యాడ్లను పునరుద్ధరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
లాంచ్ప్యాడ్ల వద్ద ఉగ్రవాదులు:- ప్రస్తుతం ప్రపంచం దృష్టి, అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ ల మధ్య నెలకొన్న సంక్షోభం కేంద్రీకృతమై ఉంది.ప్రస్తుతం సమయంలో భారత్లో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే అదునుగా భావించి పాకిస్థాన్, ఈ కుట్రకు పాల్పడుతోందని నిఘా విభాగానికి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని లాంచ్ప్యాడ్లకు పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను తరలించి చొరబాటుకు సిద్ధంగా ఉంచారని సమాచారం ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఇటీవలి కాలంలో భారత సరిహద్దు భద్రతా బలగాల అప్రమత్తతతో పలు చొరబాటు యత్నాలు విఫలమయ్యాయి.
గ్రూపులుగా విభజించి:- దింతో పాకిస్థాన్ తన వ్యూహాన్ని మార్చుకుని, ఒకేసారి పలు ప్రాంతాల నుంచి 10 నుంచి 15 మంది ఉగ్రవాదులను గ్రూపులుగా విభజించి, భద్రతా బలగాల దృష్టిని మరల్చాలని చూస్తోంది. ఇలాచేస్తే కొందరైనా భారత్లోకి చొరబడగలరని పాకిస్థాన్ భావిస్తోంది. గత సంవత్సరం భారత బలగాలు నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఉగ్రవాద మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో పాక్పై మతోన్మాద సంస్థల నుంచి ఒత్తిడి పెరిగింది. లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల నుంచి ఐఎస్ఐపై ఒత్తిడి వస్తోంది. స్థానిక నెట్వర్క్ లు బలహీనపడటంతో, సరిహద్దుల నుంచి శిక్షణ పొందిన, యుద్ధ నైపుణ్యం ఉన్న ఉగ్రవాదులను పంపి భారీ దాడులకు పాల్పడాలని ఐఎస్ఐ యోచిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.దింతో దేశంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

