” సింగిల్ డే-సింగిల్ షిఫ్ట్ లో పెన్-పేపర్ మోడ్” పద్దతిలో నీట్ (యూజీ) పరీక్షలు-ఎన్టీఏ
అమరావతి: MBBSతో సహా యూజీ-వైద్య విద్యాకోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే NEETపై జాతీయ పరీక్షా సంస్థ (NTA) ప్రకటన విడదల చేసింది..” సింగిల్ డే-సింగిల్ షిఫ్ట్ లో పెన్-పేపర్ మోడ్” (OMR బేస్డ్)లో నీట్ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది..నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఖరారు చేసిన మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది..MBBSతోపాటు BAMS,,BUMS,,BSMS కోర్సులకు యూనిఫామ్ నీట్ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది..నీట్ ఫలితాల ఆధారంగా నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద BHMS కోర్సు అడ్మిషన్లు నిర్వహిస్తారని,,అలాగే ఆర్మ్ డ్ మెడికల్ సర్వీస్ హాస్పిటల్స్‌లో BSc నర్సింగ్ కోర్సు అడ్మిషన్లకు నీట్ క్వాలిఫై కావాల్సి ఉంటుందని పేర్కొంది.. నాలుగేండ్ల BSc నర్సింగ్ కోర్సుకు కూడా నీట్ (యూజీ) కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని తెలిపింది.