కొరడా దెబ్బలు కొట్టుకుని నిరసన తెలిపిన అన్నామలై
అమరావతి: తమిళనాడు అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై గురువారం తీవ్రంగా స్పందించారు.. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తూ శుక్రవారం కోయంబత్తురులో ఇంటి ముందు 6 కొరడా దెబ్బలు కొట్టుకుని నిరసన తెలిపారు.. DMK ప్రభుత్వంను గద్దెదించే వరకు చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేశారు..ఇక నుంచి తాను మూస పద్దతుల్లో రాజకీయాలు చేయబోనని అన్నారు.. DMK ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని,,అన్నా యూనివర్శిటీ లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన జ్ఞానశేఖరన్ గతంలో కూడా నేరాలు చేశాడని అన్నామలై ఆరోపించారు.. DMK నేతలతో సన్నిహిత సంబంధలు ఉన్న కారణంగా పోలీసుల ఆయనపై రౌడీ షీట్ తెరవలేదని మండిపడ్డారు..డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ ఇవాళ తనకు తాను కొరడా దెబ్బలు కొట్టుకున్నారు..DMK ప్రభ్వుతాని గద్దె దించేందుకు శుక్రవారం నుంచి 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తున్నారు.