వరల్డ్ అండర్-20 ఛాంపియన్షిప్స్ లో సిల్వర్ మెడల్స్ ను సాధించిన భారత అథ్లెట్లు
అమరావతి: అమెరికాలోని ఒరెగా వేదికగా జరుగుతున్న వరల్డ్ అండర్-20 ఛాంపియన్షిప్స్ 2026లో భారత అథ్లెట్లు పతకలను సాధిస్తున్నారు. జావెలిన్ త్రోలో పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ అశిష్ యాదవ్,హై జంప్‌లో బసంత్ కుమార్ మేఘ్వాల్ లు అత్యుత్తమ ప్రదర్శనతో సిల్వర్ మెడల్స్ ను సాధించారు. అండర్ 20 ఛాంపియన్షిప్స్ లో భారత యువ తేజాలు ఉత్తమ ప్రదర్శనలు నమోదు చేస్తున్నారు.
శనివారం పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో అశీష్ యాదవ్ 74.09 మీటర్ల త్రో ద్వారా రెండో స్థానంతో సిల్వర్ మెడల్ సాధించాడు. ఆదివారం జరిగిన హై జంప్ ఫైనల్లో భారత అథ్లెట్ రెండో ప్రయత్నంలో 2.21 మీటర్ల ఎత్తు దూకాడు. దింతొ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్వనతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ అందుకున్నాడు. అండర్ 20 ఛాంపియన్షిప్స్ లో భారత్‌కు హై జంప్‌లో తొలి పతకం సాధించిన బసంత్ చరిత్రకెక్కాడు. 10 సంవత్సరా క్రిందట నీరజ్ చోప్రా బంగారు పతకం గెలిచిన ఈ టోర్నీలో భారత అథ్లెట్లు తమ సత్తా చాటుతూ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు.

