DEVOTIONALNATIONALOTHERS

అయోధ్య రామ్ లల్లా ఆలయంపై “అభిజీత్” ముహూర్తం’లో ధ్వజారోహణ చేసిన ప్రధాని మోదీ

 అమరావతి: అయోధ్య రామ మందిర శిఖరంపై కాషాయ వర్ణ ధర్మ ధ్వజాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎగరేశారు. ధ్వ‌జ‌స్తంభంపై కాషాయ జెండా ఎగుర వేయడంతో ఆలయం నిర్మాణం సంపూర్ణ‌మైంది.. మంగళవారం  ఉద‌యం 11.50 నిమిషాల‌కు ‘అభిజీత్ ముహూర్తం’లో ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది.. ఆ అద్భుత ఘ‌టాన్ని తిల‌కించిన హిందువు బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.. ధ్వ‌జారోహ‌ణ జెండా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు.. త్రికోణంలో ఉన్న కాషాయ జెండాను శిఖ‌రంపై ఎగుర‌వేశారు.. ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో లంబకోణ త్రిభుజాకృతితో ఉన్న పతాకంపై సూర్యుడు, పవిత్ర ఓం, కోవిదార వృక్షాన్ని పసిడి దారంతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు.. శ్రీరాముడి తేజస్సు, శౌర్యాన్ని ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు.. గర్భగుడిలో బాలరాముడికి మోదీ ప్రత్యేక పూజలు చేశారు..ఈ మహోత్సవంలో ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, రామ్ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు..ఈ కార్యక్రమంతో ఆలయంలోని 44 తలుపులు పూజా ఆచారాల కోసం తెరుచుకున్నాయి..ధ్వజారోహణ కార్యక్రమాన్ని దాదాపు 7,000 మంది భక్తులు ప్రత్యేక కార్యక్రమంను వీక్షించారు..

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *