రామ మందిరం విరాళాల స్కాం నిందితులను వదిలిపెట్టను-సీ.ఎం.యోగీ
ప్రాథమిక ఆధారాలు కూడా లభించాయి!..
అమరావతి: అయోధ్యలోని రామ మందిరంలో విరాళాలను ప్రక్కదారి పట్టించిన నిందితులు ఎలాంటివారైనా, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. శుక్రవారం అయోధ్య పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ, తప్పు చేసినట్లు తేలితే కఠిన పరిణామాలు తప్పవని హెచ్చరించారు. లక్షలాది మంది భక్తుల విశ్వాసంతో చెలగాటమాడే వారు చట్టం నుండి తప్పించుకోలేరని అలాగే రామ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రజలు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆయన కోరారు.
ప్రాథమిక ఆధారాలు కూడా లభించాయి:- ఈ అంశంపై ముగ్గురు అధికారులతో కూడిన బృందం(సిట్) దర్యాప్తు జరుపుతోందని, దీనికి సంబంధించి ఎవరివద్దనైనా ఆధారాలుంటే సిట్‌కు సమర్పించాలని ఆయన సూచించారు. ఆలయ ట్రస్ట్ వినతి మేరకు ఈ అంశంపై దర్యాప్తు జరిపేందుకు సిట్ ఏర్పాటు చేశామని, ఈ అంశంలోని విషయాల్ని సిట్ వెలుగులోకి తెస్తుందని భావిస్తున్నామన్నారు. భక్తులు కూడా ఆలయంపై జరుగుతున్న అనేక దుష్ప్రచారాలను నమ్మకుండా సహనంతో ఉండాలని, ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలకు దూరంగా ఉంటూ, రాముడికి సంబంధించి గౌరవం, సహనం కలిగి ఉండాలని భక్తులను కోరారు.
రామాలయ నిర్మాణాన్ని అడ్డుకున్న కాంగ్రెస్:- గతంలో అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఇక్కడి ఆలయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు నటిస్తోందని, ఇది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను తెలియచేస్తొందన్నారు.రామాలయ ఉద్యమాన్ని కూడా కోర్టులో కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందున్నారు.
కరసేవకులపై కాల్పులు జరిపించిన సమాజ్‌వాదీ పార్టీ:- రామభక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటున్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చేస్తున్న ఆరోపణలపై సీ.ఎం యోగి మండిపడ్డారు. గతంలో కరసేవకులపై కాల్పులు జరపాలంటూ ఆదేశించిందని, జై శ్రీరామ్ అన్నవారిపై విచక్షణ రహితంగా లాఠీ చార్జీ చేయించిన విషయంను అయన గుర్తు చేశారు.

