విజయవాడ వెస్ట్ బైపాస్‌లో అగ్ని ప్రమాదంలో దగ్దం అయిన EV కారు-నాలుగురు మృతి
అమరావతి: విజయవాడ నగరం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో EV కారు అతి వేగంగా ప్రయాణిస్తూ, రెయిలింగ్‌ను ఢీకొట్టిందని స్థానికులు పేర్కొన్నారు. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, కారులో ప్రయాణిస్తున్న నలుగురు సజీవ దహనమయ్యారు. గుంటూరు జిల్లా నంబూరులోని ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులను నున్నకు చెందిన కొమ్మారెడ్డి రాందేవ్ (39), ఆయన తల్లి కొమ్మారెడ్డి అరుణ, ఓ చిన్నారి, నంబూరుకు చెందిన తిగురు విజయగా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి విషమంగ వుంది. క్షతగాత్రుడిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలంకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.?

