AP&TGDEVOTIONALOTHERS

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు-అమ్మవారి అలంకారలు

అమరావతి: ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో 2025 దసరా ఉత్సవాలకు సంబంధించి పోస్టరు ను దుర్గ గుడి ఈవో శీనా నాయక్, వైదిక కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.ఈ సంత్సరం దసరా మహోత్సవాలు ప్రతి ఏడాది లాగానే వైభవంగా నిర్వహిస్తామని ఈవో శీనానాయక్ తెలిపారు.సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది11 రోజుల పాటు విశేషంగా దసరా మహోత్సవాలు,,ప్రతి రోజు సాయంత్రం నగరోత్సవాలు జరుగుతాయని తెలిపారు..మూలా నక్షత్రం 29వ తేదీ సోమవారం వచ్చిందని,,మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు.. అక్టోబర్ 2వ తేదీ గురువారం విజయదశమి రోజున ఉదయం మహా పూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవం కార్యక్రమం జరుగుతుందన్నారు.

అమ్మవారి అలంకారలు:- 22వ తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారం,,,23వ తేదీ  శ్రీ గాయత్రి దేవి అలకారం,,,24వ తేదీ శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం,,,25వ తేదీ శ్రీ కాత్యాయిని దేవి అలంకారం,,,26 వ తేదీ శ్రీ మహా లక్ష్మీ దేవి అలంకారం,,,27వ తేదీ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం,,,28వ తేదీ శ్రీమహా చండీ దేవి అలంకారం,,,29వ తేదీ శ్రీ మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతి దేవి అలంకారం,,,30వ తేదీ శ్రీ దుర్గా దేవి అలంకారం,,,1వ తేదీ శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం,,2 వ తేదీ విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం జరుగుతయన్నారు..

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *