NATIONAL

సర్‌ లో అవకతవకలపై ఎన్నికల కమిషనర్లు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు

రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు వరకు నిర్వహించిన మార్చ్‌ పై బెంచ్ అభ్యంతరం..

అమరావతి: ఓటర్ల వేరిఫికేషన్ (సర్‌-SIR)లో అవకతవకలు జరిగాయంటూ ఇండియా బ్లాక్ కూటమి నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై కోర్టు గురువారం విచారణకు స్వీకరించింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తోంది.

న్యాయవ్యవస్థను బెదిరించలేరు:- గత సోమవారం(12వ తేది) కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సుప్రీంకోర్టు వరకు నిర్వహించిన మార్చ్‌ పై సుప్రీం బెంచ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ,, సుప్రీంకోర్టు వరకు చేపట్టిన ర్యాలీపై తప్పనిసరిగా వివరణ ఇవ్వాలని కోర్టు సూచించింది. ఎవ్వరూ న్యాయవ్యవస్థను బెదిరించలేరని కోర్టు స్పష్టం చేసింది.ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌లో ఒకరి తరఫున తాత్కాలికంగా విచారణ చేపడతున్నామని, అయినప్పటికీ రాహుల్ గాంధీ తన ప్రవర్తనకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

నిరసనల ప్రదేశ జాబితా నుంచి తొలగింపు:- ఇదే సమయంలో జంతర్‌ మంతర్ అంశంపై కూడా కోర్టు స్పందించింది. జంతర్ మంతర్‌ను నిరసనల ప్రదేశ జాబితా నుంచి ఢిల్లీ ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన కోర్టు,, ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో సీజేపీ నేతలు జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించాలనుకున్నారు. దీంతో ఆ ప్రదేశాన్ని నిరసన ప్రదేశంగా తొలగిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీజేపీ తరఫును సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జంతర్ మంతర్‌ను తిరిగి నిరసన ప్రదేశంగా మార్చాలని ఆ పిటిషన్‌లో కోరారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు,ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *