NATIONAL

కమర్షియల్ LPGపై విధించిన అంక్షాలను ఎత్తివేసిన కేంద్రం

అమరావతి: అమెరికా- ఇరాన్ తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకోవడంతో,దేశంలో హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు సరఫరా చేసే కమర్షియల్ LPGపై విధించిన అన్ని పరిమితుల్ని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. యుద్ధ సంక్షోభానికి ముందు ఉన్న స్థాయికి సరఫరాల్ని పునరుద్ధరించింది. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ ఈ మేరకు గురువారం రోజు ఒక ప్రకటన విడుదల చేసింది. దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి పెరగడం సహా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎల్పీజీ ట్యాంకర్లు వస్తుండటం వల్ల సరఫరా గణనీయంగా మెరుగుపడిందని తెలిపింది. దీంతో వాణిజ్య ఎల్పీజీ సరఫరాల్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించినట్లు వెల్లడించింది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *