AP&TG

బంగాళాఖాతంలో అల్పపీడనం-తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం-ఐఎండీ

అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో అల్లూరి, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, రానున్న 48 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు ఈ మేరకు ఓ ప్రకటనలొ పేర్కొన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. సముద్ర మట్టానికి సగటున 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉందని వెల్లడించింది.ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ప్రాంతం కాకుండా మిగిలిన బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో వాతావరణం సాధారణంగా ఉంటుందని చెప్పింది. ఈ వారం చివరి నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని తెలిపింది.

వడగాలులు వీచే అవకాశం:- మరోవైపు అల్లూరి జిల్లా జికే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *