నిలువునా చీలిపోయిన AIADMK ఎమ్మేల్యేలు-TVKపార్టీకి మద్దతూ
అమరావతి: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ రేపు TVK పార్టీ బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో 47 మంది ఎమ్మేల్యేలు వున్న AIADMK నిలువునా చీలిపోయింది. పార్టీ సీనియర్ నేతలు సి.వి. షణ్ముగం, ఎస్.పి. వేలుమణి నేతృత్వంలోని రెబల్ వర్గంలో దాదాపు 30 మంద ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడంతో.తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణలు ప్రారంభం అయ్యాయి. పార్టీ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తూన్న ఎడప్పాడి పళనిస్వామిపై పర్గంలో దాదాపు 17 మంది ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ అయిన DMK సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు EPS ప్రయత్నించారని, ఇది పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని వారు మండిపడ్డారు.’మా పార్టీ DMKని వ్యతిరేకించిన తరువాత ఏర్పాడిందని రెబల్స్ వర్గం నాయకుడు వెల్లడించారు.53 ఏళ్లుగా మేము అదే పోరాటం చేస్తున్నాం. EPS తన స్వలాభం కోసం DMK తో కలిసేందుకు ప్రయత్నించడం అంటే, AIADMK అస్తిత్వమే దెబ్బతింటుందని తెలిపారు.అందుకే ప్రజాక్షేత్తంలో గెలిచిన విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’ అని షణ్ముగం పేర్కొన్నారు.
‘”మేము ఇప్పుడు ఎటువంటి ఎన్నికల ముందున్న కూటమిలో లేము.పార్టీని బలోపేతం చేసుకోవడమే మా లక్ష్యం. అందుకే విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం.” అని సి.వి. షణ్ముగం తెలిపారు. విజయ్ నేతృత్వంలోని TVK కూటమికి ఇప్పటికే 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.ఇప్పుడు AIADMK రెబల్స్ కూడా తోడవడంతో అసెంబ్లీలో ఆయన బలం మరింత పెరగనుంది. మే 13న జరగనున్న విశ్వాస పరీక్ విజయ్‌కు సులభం కానుంది.మరి తమిళనాట రాజకీయం ఏ మలుపు తిరగబొతుందొ వేచి చూడాల్సిందే..

